FacebookTwitterYouTubeDailymotionScribdCalameo
SlideshareIssuuPinterestGoogle plusInstagramTelegram
Chat About Islam Now
Choose your country & click on the link of your language.
Find nearby Islamic centers & GPS location on the map.

Our Islamic Library contains:
Islamic TVs channels LIVE
Islamic Radios LIVE
Multimedia ( Videos )
Multimedia ( Audios )
Listen to Quran
Interactive files & QR codes
Misconceptions
Islam Q & A
Morality in Islam
Articles
The Noble Qur'an
Understanding Islam
Comparative Religions
Islamic topics
Women in Islam
Prophet Muhammad (PBUH)
Qur'an and Modern Science
Children
Answering Atheism
Islamic CDs
Islamic DVDs
Presentations and flashes
Friend sites

Articles' sections



Author:


Go on with your language:
qrcode

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం చేసిన అంతిమ హజ్ ప్రసంగం

Viewed:
1110

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం చేసిన అంతిమ హజ్ ప్రసంగం  

623 A.C. వ సంవత్సరం, మక్కా నగరం దగ్గర ఉన్న అరాఫాత్ మైదానంలో చేసిన ప్రసంగంలోని భాగం

అల్లాహ్ ను ప్రశంసించి, కృతజ్ఞతలు తెలిపిన తర్వాత, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సంబోధించారు (ప్రపంచం నలుమూల నుండి వచ్చిన దాదాపు లక్షన్నర స్త్రీపురుషుల సమూహానికి చేసిన ఉపదేశం):

"ఓ ప్రజలారా! శ్రద్ధగా వినే చెవిని నాకు అప్పుగా అప్పగించండి, ఎందుకంటే నేను ఈ సంవత్సరం తర్వాత మీ మధ్యన జీవించి ఉంటానో లేదో నాకు తెలియదు. కాబట్టి, నేను మీకు చెబుతున్న దానిని చాలా జాగ్రత్తగా వినండి మరియు  ఈ పదాలను (సందేశాన్ని) నేడు ఇక్కడ హాజరు కాలేకపోయిన వారికి కూడా చేర్చండి. 

ఓ ప్రజలారా! మీరు ఈ నెలను, ఈ దినమును పవిత్రమైనదిగా పరిగణించినట్లే,  ప్రతి ముస్లిం యొక్క జీవితాన్ని (ప్రాణాన్ని) మరియు సంపదను(ఆస్తిని) పవిత్రమైన విశ్వాస నిక్షేపంగా (నమ్మికగా) పరిగణించవలెను. మీ వద్ద నమ్మకంతో ఉంచిన వస్తువుల్ని, వాటి అసలైన యజమానులకు తిరిగి వాపసు చెయ్య వలెను.  మీరు ఎవ్వరికీ హాని కలిగించ కూడదు, దాని వలన మీకెవ్వరూ హాని కలిగించరు. నిశ్చయంగా మీరు మీ రబ్ (ప్రభువు) ను కలుసుకోబోతున్నారు మరియు ఆయన నిశ్చయంగా మీ కర్మల లెక్క తీసుకోబోతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచు కోవలెను. 

మీరు వడ్డీ తీసుకోవటాన్ని అల్లాహ్ నిషేధించాడు; కాబట్టి ఇక మీదట వడ్డీ వ్యాపారానికి సంబంధించిన నియమనిబంధనలన్నీ, హక్కులన్నీ రద్దు చేయబడినవి. మీ యొక్క అసలు మూలధనం మాత్రం మీరు తీసుకోవచ్చును. మీరు అసమానత్వాన్ని (హెచ్చుతగ్గులను, భేదాలను, వైషమ్యాలను) బలవంతంగా రుద్దకూడదు మరియు సహించకూడదు. వడ్డీ నిషేధించబడినదని అల్లాహ్ తీర్పునిచ్చినాడు మరియు అబ్బాస్ ఇబ్నె అబ్దుల్ ముత్తలిబ్ కు చెల్లించ వలసి ఉన్న మొత్తం వడ్డీ ఇక మీదట రద్దు చేయబడినది.

షైతాన్ నుండి మీ ధర్మాన్ని కాపాడుకునేందుకు అప్రమత్తంగా (జాగ్రత్తగా) ఉండవలెను. అతడు పెద్ద పెద్ద విషయాలలో మిమ్ముల్ని తప్పు దారి పట్టించే శక్తి తనకు ఏ మాత్రం లేదని తెలుసుకుని, తన ఆశలన్నీ వదులుకున్నాడు. కాబట్టి చిన్న చిన్న విషయాలలో కూడా అతడిని అనుసరించకుండా అప్రమత్తంగా ఉండవలెను. 

ఓ ప్రజలారా! మీ స్త్రీలపై మీకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నమాట వాస్తవమే కాని వారికి కూడా మీ పై హక్కులు ఉన్నాయి. జ్ఞాపకం ఉంచుకోండి, కేవలం అల్లాహ్ పై ఉన్న విశ్వాసం ఆధారంగానే మరియు అల్లాహ్ యొక్క అనుమతి మూలంగానే మీరు వారిని తమ తమ భార్యలుగా చేసుకున్నారు.

మీ స్త్రీలతో మంచిగా ప్రవర్తించండి మరియు దయాదాక్షిణ్యాలతో వ్యవహరించండి ఎందుకంటే వారు మీ జీవిత భాగస్వాములు మరియు శ్రద్ధాభక్తులతో, సేవానిరతితో సహాయ సహకారాలందించే అంకితమైన సహాయకులు. ఒకవేళ వారు స్థిరంగా మీ హక్కులను పూర్తిచేస్తున్నట్లయితే, మీ నుండి దయతో ఆహారం (అన్నపానీయాలు) మరియు దుస్తులు పొందే హక్కు వారి స్వంతమవుతుంది. ఇంకా మీరు అనుమతించని(ఇష్టపడని) వారితో, వారు స్నేహంగా మెలగకూడదనేది మరియు తమ శీలాన్ని అస్సలు కోల్పోకూడదనేది (వ్యభిచరించకూడదు, తుంటరిగా ప్రవర్తించకూడదు) వారిపై మీకున్న హక్కు.

ఓ ప్రజలారా! అత్యావశ్యకంగా నా మాట వినండి. కేవలం అల్లాహ్ నే ఆరాధించండి, ప్రతి దినపు ఐదు తప్పని సరి నమాజులను పూర్తిచేయండి, రమదాన్ నెలలో తప్పనిసరిగా ఉపవాసం ఉండండి మరియు తప్పనిసరి అయిన విధిదానం (జకాత్) పేదలకు పంచిపెట్టండి. ఒకవేళ మీకు తగిన శక్తిసామర్ధ్యాలు ఉన్నట్లయితే, హజ్ యాత్ర పూర్తిచేయండి. 

మొత్తం మానవజాతి ఆదం (అలైహిస్సలాం) సంతతి యే మరియు అరబ్ వాసులకు ఇతరులపై ఎటువంటి ఆధిక్యం లేదు, మరియు ఇతరులకు అరబ్ వాసులపై ఎటువంటి ఆధిక్యం లేదు; అలాగే నల్లవారి పై తెల్లవారికి ఎటువంటి ఆధిక్యం లేదు మరియు తెల్లవారి పై నల్లవారికి ఎటువంటి ఆధిక్యం లేదు, కేవలం దైవభక్తి మరియు మంచి నడవడికలో తప్ప.

ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క ఇతర ముస్లింకు సోదరుడని మరియు ముస్లింలు సోదర భావాన్ని తప్పక స్థాపించాలని గ్రహించవలెను. తోటి ముస్లింలకు చెందిన వాటిపై, మీకు ఎటువంటి అధీనం (ఔరసత్వం) లేదు, కాని స్వతంత్రంగా మరియు మనస్పూర్తిగా వారు ఇష్టపడి మీకిస్తే తప్ప. కాబట్టి, ఈ విధంగా మీకు మీరే  (ఇతరుల హక్కును గౌరవించకుండా) అన్యాయంచేసుకోవద్దు.

జ్ఞాపకం ఉంచుకోండి, ఒకరోజు మీరు అల్లాహ్ ముందు హాజరవబోతున్నారు. మీరు చేసిన ప్రతి పనికి, ప్రతి ఆచరణకు ఆ రోజున సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి, జాగ్రత్త! నేను ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు సత్యమార్గానికి  దూరం కావద్దు. 

ఓ ప్రజలారా! నా తర్వాత వేరే ప్రవక్త లేక వేరే సందేశహరుడు రారు. మరియు ఏ క్రొత్త ధర్మమూ పుట్టదు. కాబట్టి వివేకంతో, జ్ఞానంతో, బుద్ధితో సరిగ్గా వ్యవహరించండి.

ఓ ప్రజలారా! ఇంకా, నేను మీకు తెలియజేస్తున్న ఈ పదాలను మంచిగా అర్థం చేసుకోవలెను నేను నా వెనుక (నా తర్వాత) రెండు విషయాలను వదిలి వెళ్ళుతున్నాను, ఒకటి దివ్యఖుర్ఆన్ మరియు రెండోది నా నిదర్శనం (దృష్టాంతం, ఉదాహరణ (సున్నత్) మరియు మీరు ఈ రెండింటినీ గనుక అనుసరిస్తే, ఎట్టి పరిస్థితిలోను నశించిపోరు.

నా వాక్కులు వింటున్నమీరందరూ, వీటిని ఇతరులకు చేర్చవలెను, ఇంకా ఆ ఇతరులు వేరే ఇతరులకు చేర్చవలెను. అలా విన్నవారిలో చిట్టచివరి తరం వారు, ఇప్పుడు నా నుండి ప్రత్యక్షంగా వింటున్న మీకంటే ఇంకా మంచిగా అర్థం చేసుకోవటానికి కూడా ఆస్కారం ఉన్నది.

ఓ అల్లాహ్ (ఏకైక దైవారాధకుడు ), నేను నా కివ్వబడిన దివ్యసందేశాన్ని నీ ప్రజలకు అందజేసానని సాక్ష్యంగా ఉండవలెను.

www.islamic-invitation.com

 
All copyrights©2006 Islamic-Invitation.com
See the Copyrights Fatwa